రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు
మంచిర్యాల: భీమారం ప్రధాన రహదారిపై 2 బైక్‌లు శనివారం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.