బీజేపీపై స్టాలిన్ విమర్శలు
బీజేపీపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీహార్ ఫార్ములాను అమలు చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీహార్‌లో సీఎం నితీశ్‌ను ముందు నిలబెట్టి.. ఎన్నికలు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయనను పక్కన పెట్టిందని తెలిపారు. ఈ తరహాలోనే పళనిస్వామిని ముందుపెట్టి బీజేపీ అధికారాన్ని పొందాలని చూస్తోందని మండిపడ్డారు.