ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు

PDPL: గోదావరిఖని ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటో భవన్‌లో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు నిర్వహించారు. TPCC సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాలగర్భంలో కలిసిన చరిత్రకు సజీవ ఆనవాళ్లు నిలిపేది ఫోటోగ్రఫీ అని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.