ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు: జిల్లా కలెక్టర్
KMM: ప్రణాళికాబద్ధంగా రబీ (యాసంగి) పంట ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రబీ పంట కోతల ఆధారంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ, ధాన్యం వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.