విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
తిరుపతి సప్తగిరి నగర్‌లో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. నగరంలోని నవితా చికెన్ షాప్‌లో మధు (28) క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కోళ్లను శుభ్రం చేసే యంత్రాన్ని ఉపయోగిస్తున్న సమయంలో షాక్ తగిలి కుప్పకూలినట్లు నిర్వాహకులు తెలిపారు. చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.