విజయోత్సవ సంబరాలు నిర్వహించిన నాయకులు

విజయోత్సవ సంబరాలు నిర్వహించిన నాయకులు

MNCL: జన్నారం మండల కేంద్రంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను ఆయా పార్టీలు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారు ఇవాళ సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై టపాసులు కాల్చారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఉన్నారు.