రేసింగ్ లీగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం
'ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్' రౌండ్-2 పోస్టర్‌ను CM రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ లీగ్ వచ్చే నెల డిసెంబర్ 6న గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో జరగనుంది. రాష్ట్రంలో తొలిసారిగా సూపర్ క్రాస్ రేసింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ISRL సహ వ్యవస్థాపకుడు ఈషన్ లోఖండే మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ఈవెంట్‌ను HYDలో నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు.