బీఆర్ఎస్ నేతలపై రౌడీ షీటు నమోదు చేయాలి: ఎమ్మెల్యే
WGL: హైదరాబాద్ సీఎల్పీ మీడియా హాల్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలపై రౌడీ షీట్లు నమోదు చేయాలని, వారిపై ఎలాంటి జాలి చూపించకుండా జైళ్లకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం మంచితనం వల్లే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ బతికి బట్టకడుతున్నారని, వారు ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు.