BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ.1,50,930కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.1,800 పెరిగి రూ.1,38,350గా నమోదైంది. KG వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.