పోక్సో నిందితుడు ఆత్మహత్య

SKLM: పోక్సో కేసు నమోదైన వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సారవకోటకు చెందిన రామారావు (48)ఈ ఏడాది ఫిబ్రవరి 10న బాలికపై అత్యాచార కేసులో పోక్సో కేసులో అరెస్టయ్యాడు. బెయిల్‌పై గత నెల 29వ తేదీన విడుదలయ్యాడు. కేసుకు సంబంధించి మనస్తాపానికి గురై ఈ నెల 2వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.