ట్రాక్టరు ఢీకొని విద్యుత్ స్తంభాలు ధ్వంసం
KKD: గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం వేగంగా వచ్చిన ట్రాక్టర్ రెండు విద్యుత్ స్థంబాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్థంబాలు పూర్తిగా నేలకొరిగాయి. వెంటనే లైన్‌మెన్ విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. అయితే ఈ గ్రామాల్లో నూతన స్థంబాలు ఏర్పాటు చేసే వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.