కిరాణా దుకాణంలో చోరీ

GDWL: అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఒక కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మూసి ఉన్న దుకాణం తాళాలు పగలగొట్టి, సుమారు రూ.15 వేల విలువైన నిత్యావసర సరుకులను మరియు ఒక పెట్రోల్ డబ్బాను దొంగిలించారని దుకాణదారుడు తెలిపారు.