పందుల దాటికి మొక్కజొన్న పంట నాశనం
WGL: శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటల్లో రాత్రి వేళల్లో పందులు గుంపులు గుంపులుగా పర్యటిస్తూ పంటను నాశనం చేస్తున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట కోతకు దగ్గరగా ఉన్న సమయంలో పంట దెబ్బ తినడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.