VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

ప్రకాశం: కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రెడ్డి లాడ్జీ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.