ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
NLR: టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. గూడూరు ప్రజలకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తానని, తనకు పార్టీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.