VIDEO: చేపల వేటకు వెళ్ళిన వ్యక్తి గల్లంతు
E.G: గోకవరం మండలంలోని తంటికొండ-గాదెలపాలెం మధ్య ఉన్న పుష్కర కాలువలో గురువారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి వెళ్లిన బావాజీపేటకు చెందిన దుల్లా చరణ్ (20) గల్లంతయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియవలసి ఉంది