అటల్ విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం

అటల్ విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం

అన్నమయ్య:  మదనపల్లిలో ఆదివారం దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ CM పుష్కర్ సింగ్ ధామి ముఖ్య అతిథిగా హాజరవుతారు. కదిరిరోడ్డు ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ CM నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొంటారు.