VIDEO: వింత చర్మ వ్యాధితో వీధి కుక్కలు
ఆసిఫాబాద్ పట్టణంలో వీధి కుక్కలు వింత చర్మ వ్యాధితో కనిపిస్తుండటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్కిన్ అలర్జీతో చర్మం ఊడిపోయి అవి భయంకరంగా మారాయి. ఈ కుక్కలు వీధుల్లో తిరుగుతుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, ఆ కుక్కలకు చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు.