చేనేత కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం

చేనేత కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం

W.G: ఇటీవల మొంథా తుఫాను సృష్టించిన అలజడి తెలిసిందే. ఆ తుఫాను కారణంగా నష్టపోయిన అత్తిలి మండలం శివపురంలో 138 చేనేత కుటుంబాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వారికి బియ్యంతో పాటు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. తుఫాను కారణంగా కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించామన్నారు.