VIDEO: అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
MDK: నర్సాపూర్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న గోవులను గో రక్షకులు చౌస్తాలో పట్టుకున్నారు. ఒక కంటైనర్ లారీలో సుమారుగా 75 గోవులను నిర్బంధించి తరలిస్తుండడంతో నర్సాపూర్ గో రక్షక్ బృందం పట్టుకొని వాహనాన్ని నిలిపివేశారు. పోలీస్ అధికారులకు సమాచారం అందించి హైదరాబాద్ కామధేను గోశాలకు తరలించారు.