ముదిగేడులో 'రైతన్నా మీ కోసం' కార్యక్రమం
NDL: సంజామల మండలం ముదిగేడులో మంగళవారం వ్యవసాయ సహాయకురాలు సుమ పరిమళ, ఎంపీఈఓ వేణు గోపాల్ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు విధానాలపై, వ్యవసాయాభివృద్ధికి ఊతమిచ్చే పంచసూత్రాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. పశుసంవర్ధక కార్యదర్శి మహబూబ్ బేగ్, టీడీపీ నేత రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.