ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి

ప్రకాశం: ఒంగోలులో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. డ్రైవర్ ప్రయాణికులు ఎక్కేందుకు బస్టాండులో ఆదివారం బస్సును నిలిపి వెళ్లగా బస్సు తీసుకుని పరారయ్యాడు. అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టణంలోని కర్నూలు వంతెన వద్ద బస్సులో గుర్తించి మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.