VIDEO: ఆదోని జిల్లాతో పాటు 4 మండలాల కోసం నిరహార దీక్ష
KRNL: పెద్దహరివాణాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు ఆదివారం ఆదోని భీమాస్ సర్కిల్లో నిరహార దీక్ష చేపట్టారు. ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని, 4 మండలాలుగా విభజించాలని కోరారు. దీక్ష శిబిరం వద్దకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వెళ్లి సంఘీభావం తెలిపారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో వైసీపీ తరఫున డిమాండ్ చేస్తామన్నారు.