పెన్నాలో యువకుడి గల్లంతు

KDP: ప్రొద్దుటూరు రామేశ్వరం సమీపంలోని పెన్నా నదిలో గల్లంతైన యువకుడి ఆచూకీ తెలిసిన వారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమచారం ఇవ్వాలని ఎస్సై రాజు(9121100599) కోరారు. రైల్వే బ్రిడ్జి వద్ద ఈనెల 12న సాయంత్రం 3గంటల సమయంలో పెన్నాలో యువకుడు కొట్టుకుపోయాడు. ఆ సమయంలో అతను నీలం రంగు చొక్కా ధరించాడని, నదీ పరివాహక ప్రాంతంలో యువకుడి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.