పందిళ్లపల్లిలో పట్టపగలే చోరీ
KMM: చింతకాని మండలంలోని పందిళ్లపల్లికి చెందిన అలవాల అనంతరాములు ఇంట్లో శుక్రవారం చోరీ జరిగింది. కుటుంబ వివాదాలతో ఆయన భార్య పుట్టింటికి వెళ్లగా తండ్రీకొడుకులే ఉంటున్నారు. తండ్రి, కొడుకు పనికి వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.25వేల నగదు దొంగిలించారని తెలిపారు.