శ్రీ మఠంలో వీరశైవ పీఠాధిపతి

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు శ్రీశ్రీశ్రీ నిలగల్ అభినవ రేణుకాచార్య శివ మహా స్వామీజీ బుధవారం రాత్రి వచ్చారు. వారికి శ్రీ మఠం అధికారులు, మంత్రాలయం వీరశైవ జంగమహేశ్వరులు ఘన స్వాగతం పలికారు. మంచాలమ్మ దేవికి కుంకుమార్చన నిర్వహించి మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం గురు రాయల బృందావనాన్ని దర్శించుకున్నారు.