తర్తూరు లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయంలో పూజలు
NDL: జూపాడు బంగ్లా మండలం తర్తూరులో వెలసి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయంలో మార్గశిర మాసం బుధవారం పూజలు భక్తులు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళ హారతి నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.