రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

MBNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మూసాపేట్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారిపై కొత్తకోట, మదనాపూర్ గ్రామాలకు చెందిన చరణ్(25), అనిల్(22) బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గాజులపేట సమీపంలో రహదారిపై వంతెన గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు.