నాగుల చవితికి ఆలయం ముస్తాబు
NTR: నాగుల చవితి పండుగ కోసం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబైంది. శనివారం జరిగే నాగుల చవితి వేడుకలకు శ్రీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయ ప్రాంగణం, గర్భగుడిని వివిధ పుష్పాలతో అలంకరించారు.