ఎల్. కోట సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో
ప్రకాశం: కంభం మండలంలోని ఎల్. కోట గ్రామ సచివాలయాన్ని బుధవారం ఎంపీడీవో వీరభద్రాచారి ఆకస్మికంగా తనకి చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. విధులలో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.