రైలు కిందపడి వ్యక్తి మృతి

రైలు కిందపడి వ్యక్తి మృతి

NLG: తిప్పర్తి మండలం కంకణాలపల్లికి చెందిన సతీశ్ చారి రైలు కింద పడి చనిపోయిన ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని కేశరాజు పల్లి గ్రామ సమీపంలో రైల్ ట్రాక్ కింద పడి మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. సతీశ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.