యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి

యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి

MHBD: రైతులకు యూరియా అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. MHBDలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారంఆమె మాట్లాడారు. యూరియాను తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉందని విమర్శించారు. రామగుండం యూరియా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయినా, దాని రిపేరుకు చర్యలు తీసుకోకుండా CM ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి కప్పం కడుతున్నారన్నారు.