MROకు వినతి పత్రం అందజేసిన బలిజ కుల పెద్దలు
CTR: బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని నియోజకవర్గ సంఘ అధ్యక్షుడు నానబాల గణేష్ వాపోయారు. బుధవారం RPF ఆధ్వర్యంలో బలిజ కుల పెద్దలు పుంగనూరు MRO రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తుల పేరు మారుస్తూ వారి కులాన్ని "గిరిబలిజ" అని గుర్తిస్తున్నట్లు, జివో. నం.5 జారీ చేయడం శోచనీయమన్నారు.