గురుకుల ప్రవేశ పరీక్షల్లో గోపాలగిరి విద్యార్థుల ప్రతిభ
MBR: తొర్రూరు మండలంలోని గోపాలగిరి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి సీట్లు సాధించారు. పాఠశాలకు చెందిన క్రిత్య, హర్షిత, అశ్విని ముగ్గురు విద్యార్థినులు గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ యనమాల సావిత్రి విద్యార్థులను ఘనంగా సన్మానించారు.