VIDEO: కన్నీరు పెట్టిస్తున్న 'టమాటా'
NDL: బేతంచెర్ల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు ఎకరా పొలంలో సాగుచేసిన టమాటా పంటను దున్నేశారు. ప్రస్తుతం మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని, దిక్కుతోచని స్థితిలో పంటను దున్నానని రైతు తెలిపారు. పంట సాగు కోసం రూ.80,000 దాకా ఖర్చు చేశానని, మార్కెట్లో కిలో టమాటా రూ.3 పలుకుతోందని వాపోయాడు.