చెరువులో పసికందును పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు

చెరువులో పసికందును పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు

RR: మహేశ్వరం నియోజకవర్గం కోళ్లపడకల్లోని ఫతేసాగర్ చెరువులో పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని పరిశీలించారు. అభం శుభం తెలియని పసికందును జాలి లేకుండా చెరువులో పడేసి వెళ్లడం ఏంటని స్థానికులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.