ఢిల్లీ అల్లర్ల కేసు.. నిందితుడికి తాత్కాలిక బెయిల్
ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అయితే కఠిన షరతులతో కూడిన అనుమతి కావడంతో.. పెళ్లి వేడుకల కోసం ఆయన కొద్దిరోజులు జైలు నుంచి బయట ఉండనున్నారు.