VIDEO: భర్తను స్మశాన వాటికలో వదిలి వెళ్లిన భార్య
జగిత్యాల: పట్టణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీధర్ అనే వ్యక్తి రెండు కిడ్నీలు పాడై చావుబతుకుల మధ్య ఉన్నాడు. అతని భార్య అతన్ని స్మశాన వాటికలో వదిలి వెళ్లిపోయింది. దీనస్థితిలో ఉన్న శ్రీధర్‌ను స్థానికులు గుర్తించి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పలువురిని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.