'నేడు సిల్డ్ టెండర్ కం బహిరంగ వేలం పాట'
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెంలో వెలిసి ఉన్న నారాయణస్వామి ఆలయంలో ఇవాళ ఆలయంలో సిల్డ్ టెండర్ కం బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో గిరి రాజు నరసింహ బాబు తెలిపారు. రెండు నెలల కాలం పాటు దుకాణాలు నడుపుకొనుటకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.