కమ్మర్ పల్లిలో దోమల నివారణ చర్యలు

NZB: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో నేడు GP ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. GP పరిధిలోని గాంధీనగర్ వడ్డెర కాలనీలో, ఇందిరమ్మ కాలనీల్లో ఫాగింగ్ చేయించారు. గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో దోమల నివారణ మందును పిచికారి చేయించారు. GP పారిశుద్ధ్య సిబ్బంది గ్రామంలో వర్షం నీరు నిలిచిన గుంతల్లో, మురికి కాలువల వెంట దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు.