'విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి'
VZM: విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని దేవుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోట ఎల్లం నాయుడు అన్నారు. గురువారం బొండపల్లి మండలంలోని దేవుపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ ముగింపు వారోత్సవాలు గ్రంథాలయ అధికారి నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్ఎం రమణ, టీచర్ సుజాత పాల్గొన్నారు.