రాష్ట్ర ప్రజలు జగన్ పాలన కోరుకుంటున్నారు: మంత్రి కాకాని
NLR: చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగి వేసారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జగన్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. తమ ఉద్యమాలతో చంద్రబాబులో మార్పు రావాలన్నారు.