ఏసీబీకు చిక్కిన వీఆర్వో

VZM: వేపాడ మండలం సింగరాయి గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న సత్యవతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం చిక్కారు. ఓ రైతు నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ రైడ్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.