గిద్దలూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు.!
ప్రకాశం: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల దృష్ట్యా గిద్దలూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానస్పదంగా ఎవరైనా కనిపించినా, ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని పీఎస్ఐ వెంకటరమణ తెలియజేశారు.