రెండు దశల్లో బెంగాల్‌లో ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23న(మొదటి విడతలో) 152 స్థానాలకు, ఏప్రిల్ 29న(రెండో విడతలో) మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 294 నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికల ఫలితాలను మే 4న వెల్లడిస్తారు. NDA ఈసారి బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.