ఎర్ర కాలువకు వరద.. పునరావాస కేంద్రాల ఏర్పాటు

E.G: ఎర్ర కాలువ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ నాగరాజు నాయక్ తెలిపారు. సింగవరం, తాళ్లపాలెం, శెట్టిపేట, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆయా గ్రామాల్లో దండోరా వేయిస్తున్నామని తెలిపారు. ప్రతి పునరావాస కేంద్రంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.