ముంచెత్తిన వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ముంచెత్తిన వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

NZB: జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి ఎండ ఉన్నా, సాయంత్రానికి మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది. ఇటీవల తుఫాను కారణంగా వర్షాలు కురవగా, తాజా వర్షానికి కంటేశ్వర్, సుభాష్ నగర్, ఎన్టీఆర్ చౌరస్తా, దుబ్బ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి.