మల్లాపూర్: పోలింగ్ కేంద్రాల పరిశీలన

JGL: మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను MPO,సెక్టార్ అధికారి జగదీష్ సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాలల్లో కరెంటు, ఫర్నిచర్, నీటి వసతులు, మూత్రశాలలు, వృద్ధులకు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన ర్యాంపులను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.