కేఎంసీలో 'ప్రజావాణి కార్యక్రమం' రద్దు

కేఎంసీలో 'ప్రజావాణి కార్యక్రమం' రద్దు

ఖమ్మం కేఎంసీలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, ఇతర పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేసేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి వార్డుల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ప్రస్తుతం అధికారులు విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వివరించారు.