VIDEO: మహానందిలో వైభవంగా పల్లకి సేవ
NDL: మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారికి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఆలయ ప్రాకారంలో స్వామివారిని ఊరేగించారు. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.